అరుదైన గుండె ఆపరేషన్ చికిత్స చేసిన హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ బృందం

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ ఎండీ డి ఎం (కార్డియాలజీ) డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ ఖమ్మం ప్రాంతానికి చెందిన బేతల సుమిత్ర వయసు 64 సంవత్సరాలు 2/7/2023 న గుండెకు సంబంధించిన వ్యాధితో క్రిటికల్ పరిస్థితిలో యశోద హాస్పిటల్ లో అడ్మిట్ అయింది అరుదైన గుండె ఆపరేషన్ చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడమని పేర్కొన్నారు . గుండె వ్యాధుల విషయంలో ఇక నో టెన్షన్ 17 ఏండ్ల పాటు యశోదా ఆస్పత్రిలో గుండె వైద్యునిగా సుదీర్ఘ అనుభవంతో ప్రపంచ స్థాయి ప్రమాణాల తో వైద్య సదుపాయాలు తో గుండె జబ్బులతో బాధపడేవారు ఇక ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యం నిమిత్తం హైదరాబాద్ చైన్నె విజయవాడ బెంగళూరు వంటి ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిన పనిలేదని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 17 ఏండ్ల పాటు హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ ముందుకెళ్తున్నాను తెలిపారు గుండె సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు అత్యాధుని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కరోనరీ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ వంటి అదునాతన పద్దతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీలో ప్రధానంగా కాల్షియం రాయి వలె ఉన్న చోట ఆర్టిటాల్ ఎతరెక్టమీ రోటాబ్లేషన్ , ఇంట్రావెస్యూలార్ లిత్రెప్సి వంటి పద్దతులను అవలంభించి కాల్షియం పేరుకుపోయిన చోట చికిత్స చేయడం జరుగుతుందన్నారు వీటితో పాటు వై జంక్షన్ యాంజియోప్లాస్టి లెఫ్ట్ మెయిన్ యాంజియోప్లాస్టి వంటివి సైతం అందుబాటులో ఉన్నాయి పేస్ మేకర్ , ఏఐసిడి ఇంప్లాంట్స్ సిఆర్జి`డి ఇంప్లాంట్స్తో పాటు ఓసిటి గైడెడ్ వంటి అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండడమే కాకుండా సుదీర్ఘ అనుభవంతో వీటిని చేయడం జరుగుతుందన్నారు . రాబోవు కాలంలో ఇదే విధంగా తమ సేవలు కొనసాగుతాయని అన్నారు ప్రభుత్వ కల్పించే హెల్త్ రియబర్స్మెంట్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్లు ద్వారా కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking