ఖమ్మం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముంపుకు గురై నష్టపోయిన జర్నలిస్ట్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 06 (ప్రజాబలం) ఖమ్మం ముంపు ప్రాంతాలలో నష్టపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ళ శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టు పప్పుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా నేరెళ్ళ మాట్లాడుతూ గత 5 రోజులనుండి ముంపు ప్రాంతాల్లో దుస్తులు చీరలు, నైటీలు,బోజన వసతులు కల్పిస్తూ. అలాగే తోటి అడ్వకేట్స్ కు అండగా వున్నామని ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా వుండి నాలుగవ స్థంబంగా నిలబడి నిత్యం వార్తల్ని ప్రజలకు చేరవేసే జర్నలిస్ట్ లకు మున్నేరు పొంగి వరదల కారణంగా నష్ట పోవడం జరిగిందని మా వంతుగా నిత్యావసర వస్తువులు బార్ ఛాంబర్ లో ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వకెట్స్ దిలీప్,గోపి మొజెస్ క్రిష్టఫర్ దంపతులు పసుపులేటి శ్రీనివాస్ రావు,కొండపల్లి శ్రీనివాసరావు,బిళ్ళ శ్రీనివాస రావు బ్రహ్మం ఇజ్జగాని శ్రీనివాసరావు యుగంధర్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking