దేశంలో నంబర్ వన్ గా తెలంగాణలో బిజెపి సభ్యత్వలు చేయాలి..

 

మెదక్ బిజెపి ఎం.పీ రఘునందన్ రావు

ప్రజాబలం దినపత్రిక- మెదక్ జిల్లా నియోజకవర్గం
06-09-2024:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సంయుక్త మోర్చాల మెంబర్షిప్ వర్క్ షాప్ మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారు హాజరు కావడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మరొకసారి నెంబర్ 1 గా ఉండే విధంగా సభ్యత్వాలు నమోదు చేయాలని తద్వారా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని సూచించడం జరిగింది, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎం.పీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ సభ్యత నమోదు చాలా సీరియస్ గా తీసుకోవాలని తెలంగాణను భారతదేశంలో నంబర్ వన్ ఉండేవిధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని , ఈ సభ్యత నమోదు కార్యక్రమంతో పార్టీని సంస్థాగతంగా ఇంకా పటిష్టం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంలన్ రెడ్డి, సి.ఛ్ శ్రీనివాస్,
గోడ రాజేందర్ , జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కంటెస్టెడ్ పంజా విజయ్, జిల్లా మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, బెండవీన, రెడ్యానాయక్, మండల అధ్యక్షులు నాయన ప్రసాద్, రంజిత్ కుమార్, బి రాములు,ప్రభాకర్, సీనియర్ నాయకులు రాగి రాములు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking