ఖమ్మం ప్రతినిధి మార్చి 28 (ప్రజాబలం) ఖమ్మం వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహర్తిని తీర్చేందుకు తారకరామ ఆటో నగర్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎఫ్సీఐ రోడ్ వద్ద నూతనం గా ఏర్పాటు చేసిన చలివే వెంద్రాన్ని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం లో ఇలాంటి చలివెంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం తారకరామా ఆటో నగర్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన ఈ చలివెంద్రాల వల్ల ప్రజలు దాహర్ది ని కొంత వరకు తీర్చుకోవచ్చువీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివెంద్రాలను ఏర్పాటు చేయవలసింది గా ప్రముఖులకు,కాంగ్రేస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు ఈ కార్యక్రమం లో ఓ బి సి నగర కాంగ్రెస్ చైర్మన్ బాణాల లక్ష్మణ్ తారకరామా ఆటోనగర్ అధ్యక్షులు రవి సొసైటీ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జునరావు, గంట భీమయ్య, గంగారపు శ్రీనివాసరావు, బెజ్జంకి రాములు, మాజీ కౌన్సెలర్ సింగం అంజయ్య, నగర SC సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్ 27వ డివిజన్ అధ్యక్షులు కేశబోయిన శ్రీశైలం షేక్ రజి 48వ డివిజన్ అధ్యక్షులు భోజెడ్ల సత్యనారాయణ రవీంద్ర జాకీర్ తాళ్లూరి సాయి కిరణ్ మరియు ఆటోనగర్ బాధ్యులు, వారితో పాటు కాంగ్రెస్ నగర నాయకులు ఎమ్మె రామకృష్ణ, 46వ డివిజన్ ఓబిసి అధ్యక్షులు తుపాకుల మధు దయ్యలా నాగేశ్వరావు బండ రవి మేకల అశోక్ తదితరులు పాల్గొన్నారు
