లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాది గడిగొప్పుల కిరణ్ కుమార్ ఎన్నిక

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 29 :మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక న్యాయస్థానం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది గడికొప్పుల కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో నిర్వహించిన ఎన్నికల్లో గడిగొప్పుల కిరణ్ కుమార్ ప్యానల్ ఘన విజయం సాధించింది బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా గాండ్ల సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్, జాయింట్ సెక్రెటరీ గా నవీన్ కాంత్, ట్రెజరరీగా ఆప్టల్ బియభాని, స్పోరట్స్ అండ్ కల్చర్ ఇన్చార్జిగా సత్య గౌడ్,లైబ్రేరియన్ సెక్రటరీగా శఫీర్,మహిళ ప్రతినిధిగా జి పద్మ ఎన్నిక కాగా,ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ కోమిరెడ్డి సత్తన్న, వేల్పుల సత్యం,సుమన్, ప్రకాశం లను ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల నిర్వహణ అధికారిగా గోవిందరావు వ్యవహరించారు. కాగా నూతన బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గడికొప్పుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ…గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అదేవిధంగా పలు మండలాలను లక్షెట్టిపేట కోర్టు పరిధిలో తీసుకురావడం చేసిన కృషి సీనియర్స్ సలహాలు పాటిస్తూ న్యాయవాదల సంక్షేమానికి చేసిన గత సేవలు నేడు ఎన్నికల్లో తన ప్యానెల్ విజయానికి కారణమైనట్లు వివరించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో న్యాయవాద వృత్తి మరింతగా వన్నె తెచ్చే విధంగా బార్ అసోసియేషన్ పని పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking