రాష్ట్రం లో ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని రాష్టప్రజల ఆరోగ్యంగా ఉండటం కోసం పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క :

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 29:ప్రస్తుతం తెలంగాణాలో రోజు రోజుకు ఎండా తీవ్రత అధికంగా ఉంది కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు అదేవిధంగా కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకొని ఇంటికి చేరుకోవాలన్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అవుతున్నందున తగు జాగ్రత్తలు పాటించలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ప్రజలకు చెప్పడం జరిగినది.

రాష్టంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం జరుగుతుంది ప్రజలు హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రంలో క్రమంగా పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలి అని అన్నారు . ప్రస్తుత ఉష్ణోగ్రలను బట్టి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కావున ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంట్ల నుండి బయటకు రావద్దు అని మంత్రి వర్యులు సీతక్క గారు ప్రజలకు సూచించడం జరిగినది

Leave A Reply

Your email address will not be published.

Breaking