ఖమ్మం ప్రతినిధి జనవరి 17 (ప్రజాబలం) ఖమ్మం
టిఎన్జీవోస్ యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులుగా గుంటుపల్లి శ్రీనివాసరావు కార్యదర్శిగా కొణిదెన శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారిగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఖమ్మం జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఎం సతీష్ వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షకులు టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అసోసియెట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు మరియు ఖమ్మం జిల్లా టి ఎన్ జీవో అడహక్ కమిటీ కన్వీనర్ మరియు టీఎన్జీవో స్ కేంద్ర సంఘం అసోసియెట్ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షించారు, సింగిల్ సెట్ నామినేషన్లు రావడంతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ రోజు ఖమ్మం జిల్లా టీఎన్జీవో స్ యూనియన్ కార్యాలయం లో టిఎన్జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం నియమించ బడిన పరిశీలకులు ముత్యాల సత్యనారాయణ గౌడ్ మరియు కస్తూరి వెంకట్ ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యవర్గ నూతన కమిటీ నియామక పత్ర ఉత్తర్వులు ఖమ్మం జిల్లా నాయకత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా టిఎన్జీఓస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు టిజేఏస్ చైర్మన్ మారం జగదీశ్వర్ & కార్యదర్శులు ఎస్.ఎం. హుస్సేయిని ముజీబ్ లు నూతనంగా ఎన్నికైన ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ కార్యవర్గాన్ని అభినందించారు ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయిలో ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ నాయకత్వం పనిచేసి సమస్యల పరిష్కారంలో జిల్లా నాయకత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా నూతన కమిటీ అసోసియేట్ అధ్యక్షులుగా కొమరగిరి దుర్గాప్రసాద్, కోశాధికారిగా వల్లపు వెంకన్న, ఉపాధ్యక్షులుగా ఎర్రా రమేష్, బానోత్ శ్రీధర్ సింగ్, సగ్గుర్తి ప్రకాష్ రావు బదావత్ కరణ్ సింగ్, ఎస్. లలిత కుమారి, సహాయ కార్యదర్శిలుగా తాళ్లూరి శ్రీకాంత్, భూసా చంద్రశేఖర్, యాకూబ్ పాషా, ఏలూరి హరికృష్ణ, శీలం రాధికా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెద్దినేని రాధాకృష్ణ పబ్లిసిటీ సెక్రటరీగా ఎర్రమల్ల శ్రీనివాసరావు ఆఫీస్ సెక్రటరీగా టి.రవీంద్రబాబు, స్పోర్ట్స్ సెక్రటరీగా సాయి కృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎండి,అస్లాం ఎన్.విజయ, డి.నాగరాజు, ఇ. రవిచంద్ర, షేక్ రహీమ్ ఖాన్, వాసాల శ్రీను బి, నాగలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు టిఎన్జీవోస్ ఖమ్మం జిల్లా నాయకులు పొట్ట పింజర రామయ్య గంగవరపు బాలకృష్ణ, జడ్, ఎస్.జైపాల్ విజయ్ కుమార్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంల వణ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిలక నరసింహారెడ్డి మరియు వారికార్యదర్శి ఎండి ఫన్యుద్ధిన్ (ముక్రమ్) పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు, ఖమ్మం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రమణ యాదవ్, ఆంజనేయులు వైరా యూనిట్ అద్యక్ష కార్యదర్శులు ప్రవీణ్, అనంతరాములు, కల్లూరు అధ్యక్ష కార్యదర్శులు వజయ్ పెద్ద పుల్లయ్య, సత్తుపల్లి అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ చైతన్య రఘునాథపాలెం అధ్యక్ష కార్యదర్శులు వీరన్న శ్రీనివాసరావు మధిర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస రావు రజనీకాంత్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు సైదులు లింగమూర్తి నేలకొండపల్లి అధ్యక్ష కార్యదర్శులు అవినాష్ రవి కుమార్ పాల్గొని శుభకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఆనందోత్సవాలతో నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. నూతనంగా ఎన్నికైన టిఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కార్యవర్గానికి టీజీవో రాష్ట్ర అధ్యక్షులు, టి.జె.ఏ.సి రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు టీజీవో ఖమ్మం జిల్లా అధ్యక్షకార్యదర్శులు కస్తాల సత్యనారాయణ మోదుగు వేలాద్రి పి.ఆర్.టి.యు యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు, టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్షులు నాగిరెడ్డి, ఎస్, విజయ్ ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, తెలంగాణ పిఆర్టియు అధ్యక్షులు కొమ్మినేని అనిల్ కుమార్ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు జి.సూర్యప్రకాష్ రావు రెవిన్యూ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేష్, ఎంపీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిక్కు, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామినేని భవాని, ఉల్లంగి పద్మ తదితరులు పాల్గొన్నారు