జాతీయ స్థాయికి ఎంపికైన ఎస్ఎఫ్ఎస్ విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిధి జనవరి 17 (ప్రజాబలం) ఖమ్మం
ఈనెల 7 నుండి 9 వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎస్.వి.కే.యం. పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలలోఎస్ఎఫ్ఎస్ పాఠశాల బల్లేపల్లి కు చెందిన విద్యార్థులు టి. సత్యసాయి సిహెచ్ యశ్వంత్ లు ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సబ్ తీమ్ విభాగంలో స్మార్ట్ కార్ అండ్ స్మార్ట్ కమ్యూనికేషన్ టైటిల్ తో ప్రదర్శించిన ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థులను, ప్రాజెక్టు గైడ్ టీచరు కే. రోషయ్య లను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం కలెక్టరేట్ లో అభినందించారు. ఈనెల 21 నుంచి 25 వరకు పాండిచ్చేరిలో జరగనున్న సౌత్ ఇండియా స్థాయి పోటీలలో పాల్గొనే విద్యార్థులను, పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి లను జిల్లా కలెక్టర్, డీఈఓ సోమశేఖరశర్మ లు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా నుంచి అత్యుత్తమ ప్రాజెక్టులను జాతీయ స్థాయిలో అందించాలని ఆకాంక్షించారు ప్లాస్టిక్ నిర్మూలించడానికి భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తయారు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking