బ్యాంకులు,ఎ టి ఎమ్ ల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి

 

ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు,సిసి కెమెరాలు,అలారం సిస్టం ఏర్పాటు చేయాలి

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 17 : బ్యాంకు అధికారులు సిబ్బంది,పోలీస్‌ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే నేరాలను నియంత్రించవచ్చని రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సిపి పోలీసు కార్యాలయంలో కమీషనరేట్ పరిధి పెద్దపల్లి,మంచిర్యాల జోన్ వ్యాప్తంగా ఉన్న ఎసిపి లు వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు,సిసి కెమెరాల ఏర్పాటు,ఆర్థిక నేరాలు, గతంలో రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధి లో జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లు,తీసుకోవలసిన జాగ్రత్తలపై, తదితర అంశాలపై సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ…రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ లో 109 బ్యాంకు లు, 79 ఏటీఎం సెంటర్స్ ,మంచిర్యాల జోన్ పరిధిలో 109 బ్యాంకు లు, 89 ఏటీఎం సెంటర్స్ లను గుర్తించడం జరిందని అన్నారు. బ్యాంకులు,ఎటిఎంల వద్ద పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తూచ తప్పకుండా పాటించాలని, ఎటిఎం కేంద్రాల వద్ద కచ్చితంగా గార్డును నియమించాలని సిపి గారు ఆదేశించారు.నిరంతరం సెక్యూరిటీ గార్డు,సిసి కెమెరాలు,అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.రామగుండము కమీషనరేట్ పోలీసులు నిర్వహించిన ఆడిట్‌లో దాదాపు బ్యాంకులు, టీఎంలలో అధిక నాణ్యత లేని సీసీ కెమెరాలు ఉన్నాయని,చాలా బ్యాంకుల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరని ఈ సమావేశం అనంతరం అన్ని ఎటిఎంలలో,బ్యాంకులలో అలారం సిస్టమ్‌లతో పాటు సిసిటివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు
సెక్యూరిటీని నియమించాలని,దోపిడీ సమయంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించాలో దానిపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.లోపలికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేయడానికి డ్యూటీలో ఉన్న గార్డుకు బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద ఒక DFMD (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్)ను ఏర్పాటు HHMD (హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్) అందించాలి.
సెక్యూరిటీ గార్డును బ్యాంక్ లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నియమించినప్పటికీ,అతని వ్యక్తిగత సమాచారం యొక్క పూర్తి రికార్డు,అతని ఫోటోతో పాటు,బ్యాంక్ వద్ద ఉంచాలి.
కొత్తగా నియమితులైన వారు లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడిన వారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి.చాలా నేరాలలో నిందితులు సీసీటీవీ లపై స్ప్రే చేసి సిసిటివిలు పని చేకుండా చేసి దొంగాతలకు పాల్పడుతారు అదేవిధంగా DVR లను దొంగిలించి నాశనం చేయడం చేస్తారు కావున DVR లను కనిపించేలాగా కాకుండా సీక్రెట్ ప్రాంతాలలో దాచాలి.
అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌లో భాగమైన నిజమైన కస్టమర్‌లు మరియు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి మరియు ఆయుదాలు ఉపయోగం పై సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇవ్వాలని,సెక్యూరిటీ గార్డ్, బ్యాంకు లోపల మరియు బయట పరిసరాలను, వ్యక్తులను వారి కదలికలు,ప్రవర్తనలను గమనిస్తూ ఉండాలి. బ్యాంక్ అధికారులను కూడా ఆదేశించారు.ఏటీఏమ్ లో డబ్బులు ఫీల్లింగ్ సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలోని బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.ప్రతి బ్యాంకు అధికారులకు, సిబ్బందికి బ్యాంకు ఉన్న ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారుల నెంబర్ లు తెలిసి ఉండాలి.హెల్ప్‌లైన్ మరియు పోలీస్ స్టేషన్‌ల సంప్రదింపు నంబర్‌లను బోల్డ్ అక్షరాలతో వ్రాసి బ్యాంకు లోపల తగిన ప్రదేశాలలో ఉంచాలి,తద్వారా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అవి సులభంగా కనిపిస్తాయి. ఇప్పటివరకు,దొంగలు ఎక్కువగా బ్యాంకులను రోజుకి తెరిచినప్పుడు లేదా మూసివేయబడిన సమయంలో మరియు వారి భోజన విరామ సమయంలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు.కాబట్టి ఈ సమయంలో సెక్యూరిటీ గార్డుతో పాటు బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదకరమైన సంఘటన జరిగినప్పుడు డయల్ 100 కు,స్థానిక పోలీస్ కి సమాచారం ఉంచాలి.పని వేళల్లో మరియు తర్వాత బ్యాంకు ఆవరణలో కూర్చోవడానికి బదులు, బయట ప్రధాన ద్వారం వద్ద ఉండి అప్రమత్తంగా విదులు నిర్వహించాలి బ్యాంకు సమయం తరువాత బ్యాంకు ను పూర్తిగా డోర్స్ క్లోజ్ చేసి పని చేసుకోవాలి.
బ్యాంకుల నుండి బంగారం, డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళే వాళ్ళను లక్ష్యంగా చేసుకుని,వారిని అనుసరించి వారిని దోచుకుంటారు. బ్యాంకు బయట వాహనాలు నిలిపే ప్రాంతాలలో కూడా సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలి.రాత్రి సమయం లో కూడా సెక్యూరిటీ గార్డ్స్ లను ఆకస్మికంగా వారి పనితీరు ను తనిఖీ చేయాలని సూచించారు.ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు,ఎ ఆర్ ఏసీపీ లు ప్రతాప్,సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్,ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్,ఆర్ఐ దామోదర్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking