మరింత బాధ్యతతో పని చేస్తా

 

జిల్లా ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ అంకతి శ్రీనివాస్

పార్టీని నమ్ముకున్న కార్యకర్తకు తగిన గుర్తింపు

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 17 : మరింత బాధ్యతతో కస్టపడి పని చేస్తానని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ అంకతి శ్రీనివాస్ అన్నారు.తనను నమ్ముకొని కష్ట కాలంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఇచ్చిన మాటను నేడు రుజువు చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అందులో భాగంగానే మండల కేంద్రంలోని వెంకట్రావ్ పేట గ్రామానికి చెందిన మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్ ను మంచిర్యాల జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ గా నియమించారు.ఎమ్మెల్యే నివాసంలో అంకతి శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి నియమక పత్రాన్ని అందజేశారు.అనంతరం అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ… తనను నమ్మి తనకు ఈ పదవి కట్టబెట్టిన ఎమ్మెల్యే కు ముందుగా ధన్యవాదాలు తెలిపారు.మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్న అలాగే వారు చేసే సేవ కార్యక్రమాలన్న చాలా అభిమానమని అన్నారు.నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా వెనుకాడడని,అలాగే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఏదో విధంగా తగిన గుర్తింపుతో పాటు తన వంతు సహాయ సహకారాలు అందజేసే గుణం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుదని వారి సేవలను కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking