ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ప్రభుత్వ అభివృధ్ది, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా స్థాయి ప్రణాళిక కార్యాచరణ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అభిలాష అభినవ్, రాజార్షి షా, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్సీ దండే విట్టల్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, రామారావ్ పటేల్, పాయల శంకర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రికి జిల్లా కలెక్టర్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా పథకాలను పగడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
జనవరి 26 నుంచి ప్రారంభించనున్న పథకాలను రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, సంబందిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి, లబ్దిదారులను పకడ్బందీగా ఎంపిక చేయాలన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందజేసే భాద్యత అధికారులదేనన్నారు. రైతుభరోసా పథకానికి సంబందించి సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించాలని ఆదేశించారు. గ్రామాల్లో గ్రామ సభలు,పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి గుర్తించిన అర్హుల వివరాలను వెల్లడించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.అలాగే ఉమ్మడి జిల్లాలో నిరుపేదలందరికీ మెరుగైన విద్య, వైద్యం,త్రాగునీరు, విద్యుత్,రోడ్డు సౌకర్యం,తదితర వసతులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇటీవలే నిర్మల్ ఉత్సవాలను విజయంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ,జిల్లాలో నూతన పథకాల అమలుకోసం అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించామన్నారు. పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడతామని,జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం 17491 దరఖాస్తులు వచ్చాయని, సర్వే ద్వారా ఇప్పటివరకు 2924 మంది అర్హులను గుర్తించనట్లు తెలిపారు. దీనికి సంబందించి సర్వే కొనసాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్దిదారుల వివరాలు గ్రామ, వార్డు సభలను నిర్వహించి గ్రామ సభల ఆమోదంతో సమగ్ర జాబితాను సిద్దం చేస్తామని తెలిపారు.
ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మట్లాడుతూ, కొత్త రేషన్ కార్డుల మంజూరూ, రైతు భరోసా,రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్ల వంటి పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ అందేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు.
ఖానాపూర్ శాసనసభ్యలు వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలులో ఏజెన్సీ ప్రాంతాల నిరుపేదలకు న్యాయం జరగాలని కోరారు. క్షేత్రస్థాయి సర్వేలో నిరుపేదలను గుర్తించి వారికి పథకాలను అమలు చేయాలన్నారు.
అంతకుముందు రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను మంత్రి సీతక్క, కలెక్టర్లు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్,అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, కుష్బూ గుప్తా ( ఐటిడిఒ పిఓ), శ్యామలా దేవి,దీపక్ తివారి, శాసనసభ్యులు రామారావ్ పటేల్, పాయల శంకర్, అనిల్ జాదవ్ లు,మున్సిపల్ చైర్మెన్లు గండ్రత్ ఈశ్వర్, మేడిపల్లి సత్యం,గ్రంథాలయ చైర్మెన్ సయ్యద్ అర్జుమంద్ అలి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు ప్రజాప్రతినిధులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.