కుటుంబ తగాదాలలో రాజీమార్గంతో కేసులు సత్వరం పరిష్కారం అయ్యేం దుకు న్యాయవాదులు తుమ్మనపెల్లి లక్ష్మన్ రావు, శ్రీరాముల కిషన్, పెరుక రంగయ్య ను నియమించారు. ఈ మేరకు ముగ్గురు న్యాయవాదులు మీడి యేషన్లో శిక్షణ పొందారు. శుక్రవారము కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ని న్యాయవాదులు కలిసి శిక్షణ వివరాలను వెల్లడిం చారు. సుప్రీంకోర్టు ఆదేశా లతో తెలంగాణ హైకోర్టు మీడియేషన్ ఆర్బిట్రేషన్ కేంద్రం ద్వారా హైదరాబా ద్లో ఐదురోజుల శిక్షణ తీసు కుని ఆమేరకు ధ్రువపత్రం అందుకున్నట్టు వివరించారు. కుటుంబ తగాదాలు, వివాదా లలో రాజీమార్గంలో ప్రయత్నించి కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా కృషిచేయాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారని వారు వివరించారు.