రోడ్లపై నెంబర్ ప్లేట్ లేని వాహనాలు పట్టించుకోని పోలీసులు

 

ప్రజాబలం ప్రతినిధి మెదక్ జనవరి 17 మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ రూలర్ పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ పరిధిలోని టేక్మాల్ అల్లాదుర్గం పెద్ద శంకరంపేట్ రేగోడు తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలోని నర్సాపూర్ కౌడిపల్లి ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనదారు మరియు కార్లు వాహనదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ తీసివేసి రోడ్లపై తిరుగుతున్నారు పోలీసులు రవాణా శాఖ అధికారులు తనిఖీలు లేకుండా పోయాయి రోడ్లపై నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనబడిన పోలీసులు మాత్రం చూసి చూడనట్టుగా వదిలిపెడుతున్నారు పెద్ద శంకరంపేట మండలంలో ఎక్కడ చూసిన నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనపడతాయి అక్కడి పోలీసులు మాత్రం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘ వైఫల్యం కనపడుతుంది కొందరు బుల్లెట్ వాహనదారులు సైలెన్సర్లు తీసేసి ప్రజలు ఎక్కువగా ఉన్న స్థలాలలో పెద్ద శబ్దంతో వాహనాలపై వెళ్లడంతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి జిల్లా ఎస్పీ రవాణా శాఖ అధికారులు స్పందించి రోడ్లపై నెంబర్ ప్లేట్ లేని వాహనదారులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking