అసోసియేషన్ అధ్యక్షులుగా నునావత్ కిషన్ సెక్రటరీగా షేక్ జానీ
ఖమ్మం నవంబర్ 18 (ప్రజాబలం బ్యూరో)
ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్ అసోసియేషన్ సంఘం వారి ఆధ్వర్యంలో 5వ కార్తీక మాస వనసమారాధన మహోత్సవం సోమవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంఘము యొక్క నూతన పాలక వర్గాన్ని సంఘం గౌరవ సలహాదారులు అదాలత్ నరేంద్ మరియు వేంపటి వెంకటేశ్వర్లు సంఘం గౌరవ అధ్యక్షుడు వెంపటి ఉపేందర్ ఆధ్వర్యంలోనూతన పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది నూతన పాలక వర్గం సభ్యులు అధ్యక్షుడు నూనావత్ కిషన్ సెక్రటరీ షేక్ జానీ ఉపాధ్యక్షులు షేక్ పాషా ఉపాధ్యక్షులు (1) కత్రం శేషగిరి ఉపాధ్యక్షులు (2) భద్రం కోశాధికారి ఆకుల సైదులు కోశాధికారి (1) ఎం రామ్మూర్తి జెయింట్ సెక్రటరీ ఎన్ నరసింహారావు జాయింట్ సెక్రటరీ (2) ఎం హనుమంతరావు ఈసీ మెంబర్స్ గా వి శ్రీను, డి దిలీప్ ,ఏ శ్రీకాంత్ ,ఎల్ కె వెంకటేష్ ,కె రమేష్ ,జి అంజి ,ఫయాజ్ ఖాన్ అలీమ్ ఈ సందర్భంగా సంఘము ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించిన తదుపరి భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా సభ్యులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని అసోసియేషన్ అభివృద్ధి కి తోడ్పడుతానని అన్నారు సంఘం కార్యదర్శి మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులకు అభివృద్ధికి తోడ్పడుతానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
