ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క

ములుగు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 370 సంఘాలకు రూ 4.కోట్ల 50 లక్షల ఋణాల పంపిణీ చెక్కను మంత్రి సీతక్క అందచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు సీతక్క మాట్లాడుతూ నిజంగా మహిళలు సంతోషంగా ఉండాలని అటువంటి లక్ష్యంతోటి మన ముఖ్యమంత్రి రెడ్డి ఇందిర మహిళా శక్తి సంఘాలను బలోపేతం చేయాలని ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే నుంచి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నారని అన్నారు.
అనంతరం ములుగు మండల పరిధిలోని 38 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ/ షాది ముబారక్‌ చెక్కులను మంత్రి అందచేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసిఎస్‌ చైర్మన్లు, సత్తి రెడ్డి, రాములు, డి ఆర్‌ డి ఓ శ్రీనివాస్‌ రావు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking