ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం నగరం 21వ డివిజన్ శ్రీచైతన్య స్కూల్ వద్ద గల ఎమ్మెస్సార్ హిల్స్ నందు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు నగర ప్రజల కోరిక మేరకు వారికి అవసరం ఉన్న ప్రతి చోట రోడ్లు, డ్రైన్ లు వేశాం. ఇంటింటి త్రాగునీరు అందించినం నగరంలో తీవ్ర త్రాగునీటి సమస్య నుండి నేడు త్రాగునీటి కి శాశ్వతం పరిష్కారం చూపించగలిగాం ఏ పనులు వేగంగా నగరం అభివృద్ది చెందింది.. ఇలా అభివృద్ది చెందే క్రమంలో నిధులు చాలా అవసరం అందుకు ప్రభుత్వం నాకు పూర్తిగా సహకారం అంద జేసింది. ముఖ్యమంత్రి కేసీఅర్ పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సహకారం వల్లే ఇంత అభివృద్ది సాధ్యమైందిఇన్ని కోట్ల నిధులు ఏ నియోజకవర్గం కు ఇవ్వలేదు.. ఖమ్మం ప్రజల అదృష్టం అనే చెప్పాలి నేడు ఖమ్మం నగరంలో హైద్రాబాద్ తరువాత అంతటి మౌళిక సదుపాయాలు ఉన్నాయి నగరంలో ప్రత్యేకంగా సీసీ రోడ్లు వేసి ప్రజా రవాణాను మెరుగు పరచగలిగినం. తద్వారా నగరం వేగంగా విస్తరించింది.. కొత్తగా ఏర్పడుతున్న కాలని లకు రోడ్లు, కాల్వలు, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, వీధి దీపాలు ఇలా అన్ని సదుపాయాలు కల్పించినం మల్లెల శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ ఆళ్ల నిరిషా అంజిరెడ్డి, ప్రశాంతి లక్ష్మీ, గరికపాటి వేంకటేశ్వర రావు, మహేందర్ తదితరులు ఉన్నారు.