మానవత్వం చాటుకున్న ఖమ్మం పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్ధి మహ్మద్ రసూల్

 

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మున్నేరు ముంపు ప్రాంతంలోని జలగం నగర్ లో 2024 ఖమ్మం పార్లమెంటు కంటెస్టింగ్ అభ్యర్థి ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ రసూల్ ఆధ్వర్యంలో సుమారు 160 కుటుంబాలకు భోజనాలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ముంపు ప్రాంత బాధితులు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఇంతవరకు అందలేదని వాపోయారు బాధితులకి కనీసం తాగునీటి వసతి ఆహారం మరియు శానిటేషన్ అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని బాధితులు వాపోతున్నారు రజబ్ అలీ నగర్ కు చెందిన బాధితుడు దుర్గారావు మాట్లాడుతూ తన ఇల్లు మొత్తం వరదకి ఇల్లు మొత్తం చెత్తతో పేరుకుపోయిందని వాపోయారు ఈ కార్యక్రమంలో తెలంగాణాసామజిక ఉద్యమకారులు దరిపల్లి వీరబాబు నరేంద్ర ఆర్ఎంపి నాగేశ్వరరావు స్థానిక వరద బాధితులు భద్రమ్మ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking