నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసు,ఆర్టీసీ అధికారుల సమన్వయంతో ఖమ్మం పాత బస్‌స్టాండులో అవరణలో ఏర్పాటు చేసిన తొమ్మిది సీసీ కెమెరాలను ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ రావు గారితో కలసి టౌన్ ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పాత బస్‌స్టాండు పరిసరాలలో నేరాలతో పాటు అసాంఘీక కార్యకాలాపాలపై నిఘా పెట్టేందుకు ఆర్టీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేరాలు జరిగిన సందర్భాలలో పోలీస్ దర్యాప్తుకు, నేరాలకు పాల్పడిన వ్యక్తులను పట్టుకోవడంలోఎంతోగానో దోహదపడుతుందన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు వుంటే నేరస్ధులు దొంగతనాలు చేసేందుకు వెనకడుగు వెస్తారని తెలిపారు. ప్రయాణికులు సైతం తమ బ్యాగ్ లు, విలువైన వస్తువులతో నిర్భయంగా ప్రయాణం చేస్తారని అన్నారు మాదక ద్రవ్యాలు, గంజాయిని అరికట్టడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో సిఐ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు
