ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ అని పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు తెలిపారు నేలకొండపల్లి లో శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తోనే బడుగ బలహీన వర్గాల ప్రజల కష్టాలు దాదాపు తీరిపోనున్నాయ ని ఆయన తెలిపారు గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పి ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు 6ఆరు గ్యారంటీలను కూడా వంద రోజుల్లో అమలు చేస్తుందన్నారు.