ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 10 (ప్రజాబలం) ఖమ్మం
అర్హులైన లబ్ధిదారులకు మహాలక్ష్మి పధకంలో భాగంగా రూ.500 లకు గ్యాస్ సిలిండర్ అందించేందుకు లబ్ధిదారుల దరఖాస్తుల సర్వే ప్రక్రియను పొరపాట్లు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం ఖమ్మం అర్బన్ మండలం వైఎస్‌ఆర్ కాలనీలో కలెక్టర్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ పట్ల కలెక్టర్ పలు సూచనలు చేశారు. రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ ఏజెన్సీ, గ్యాస్ నెంబర్‌లను డాటా ప్రకారం నమోదు చేసి సరిచూడాలన్నారు. నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఏఇ కుమార్, సర్వే సిబ్బంది తదితరులు ఉన్నారు.