జగిత్యాల, ఫిబ్రవరి 10: నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆన్లైన్ సర్వీసులను అందించడానికి స్వచ్ ఈ – సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సేవ సీఈవో శ్రీధర్ తెలిపారు. స్వచ్ ఈ- సేవా కేంద్రాల నుండి ఆన్ లైన్ ద్వారా వివిధ రకాల బిల్లుల చెల్లింపులతో పాటు బస్సు, విమానాల టిక్కెట్లు బుకింగ్స్ , కొత్త పాన్ కార్డులు సవరణలు, అదే విధంగా వివిధ రకాల టెలికాం, పోస్ట్ పేయిడ్ , ప్రీ పేయిడ్ రీచార్జులు అన్ని బ్యాంకుల డబ్బు విత్ డ్రాలు, ఆధార్ ఆధారిత పనులు , వినియోగదారులకు మైక్రో ఏటీఏమ్ సేవలు , డేటా కార్డులు, ల్యాండ్ లైన్ బిల్లులు , డిటీహెచ్, బీమా, డిజిటల్ సిగ్నేచర్ , జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఫాస్ట్ ట్యాగ్ తదితర ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఆన్ లైన్ సేవలు అందిస్తూ స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. ఎస్సీ ,ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ అభ్యర్థులు, వికలాంగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులో 33శాతం ప్రత్యేక రాయితీ వుంటుందన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు స్వచ్ ఈ సేవ కేంద్రాలకై దరఖాస్తు చేయాలనుకునేవారు ఆన్లైన్లో www.swacheseva.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సీఈవో శ్రీధర్ కోరారు.