` అట్టహాసంగా ‘విూట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే విభాగం
` ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
` తొమ్మిదేళ్లలో మోదీ సర్కారు చేసిన కార్యక్రమాలను వివరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
లండన్ న్యూయార్క్ పర్యటన ముగించుకుని లండన్ హీత్రో ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ` యూకే విభాగం ఆధ్వర్యంలో విమానాశ్రయంలో సంప్రదాయ పద్ధతిలో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఢోల్ వాద్యాలు, వేద మంత్రోచ్ఛారణ, హరతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని దీపప్రజ్వలనతో కేంద్రమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో నరేంద్రమోదీ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను, ఈ సందర్భంగా భారతీయ సమాజంలో వచ్చిన మార్పులను వివరించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ఆకాంక్షలను పూర్తిచేయడం, విదేశాల్లో వారికి సరైన గౌరవం లభించేలా మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం పలువురు యువతీ యువకులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా ‘సంస్కృతి సెంటర్ ఫర్ కల్చరల్ ఎక్స్లెన్స్’ విద్యార్థులైన యువత చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
Next Post