మందమర్రిలో ఉత్సాహంగా సాగిన కైట్ ఫెస్టివల్

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 15 :

మందమర్రి పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం అర్.టి.సీ బస్టాండ్ ప్రాంగణంలో మొట్ట మొదటి సారిగా నజీర్ సౌండ్ సిస్టమ్ వారి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ను నిర్వహించారు.

ఈసందర్భంగా పట్టణ ప్రజలకు ఉచితంగా కైట్స్ అందించారు. పోటీలలో గెలుపొందిన విజేతకి ప్రైజ్ మని అందించారు. ఈ కైట్ ఫెస్టివల్ లో యువత ఉత్సాహంగా పాల్గొని పతంగులు ఎగిరేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టణ ఎస్.ఐ శివనీతి రాజశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా పతంగుల పోటీలను నిర్వహించడం అభినందనీయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ సభ్యులు గుడ్ల రమేష్, సంగి సంతోష్, మంద తిరుమల్ రెడ్డి, అంతడుపుల నాగరాజు, రాయబారపు కిరణ్, ఇసాక్, జావీద్ ఖాన్, శశి, యాదవ్,విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking