కాక స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేత రాజు లెవెన్ టీం

-విజేతలకు ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా కప్ బహుకరణ

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 15:

మందమర్రి సోషల్ మీడియా వారియర్స్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ కాకా వెంకటస్వామి స్మారకార్థం నిర్వహించిన కాకా స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో బాగంగా బుధవారం నిర్వహించిన కాకా స్మారక క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో తలపడిన రాజు 11 టీం నిఖిల్ 11 టీం హోరాహోరీ పోరు సాగించారు. నిఖిల్ 11 టీం మొదట బ్యాటింగ్ చేసి 10 ఓవర్లకి 91 పరుగులు చేయగా రాజు 11 టీం 10 ఓవర్లలో 94 పరుగులు చేసి గెలుపొందారు. చివరికి రాజు 11 టీం విజేతగా నిలిచారు. గెలిచిన రాజు 11 టీం కి మందమర్రి ఎస్సై శివనీతి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరి లక్ష్మణ్, మంద తిరుమలరెడ్డి గుడ్ల రమేష్, శ్రీశైలం చేతుల మీదుగా కప్ ను బహుకరించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులను అభినందించారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి క్రీడలలో పాల్గొనేలా చేశారని ఇలాంటి కార్యక్రమాలను ఇంకా నిర్వహించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వారియర్స్ యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి శంకర్, రాచర్ల గణేష్, సట్ల సంతోష్, గోపిశెట్టి వీరన్న, తూముల శ్రీనివాస్, రాయబారపు కిరణ్, ఎర్ర రాజు, ముడారపు శేఖర్, రాజేష్, జావిద్, ఇషాక్, సూరజ్, వంశీ, సాత్విక్, అజయ్, అయాన్, శంకర్, శివరామకృష్ణ, పసునూటి రాము, సారంగం, విద్యాసాగర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking