కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలు పంపిణీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 20 : మంచిర్యాలలోని హైటెక్ సిటీలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాస గృహం ముందు కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ అధ్వర్యంలో ముస్లిం మహిళలకు రంజాన్ కానుకలు పంపిణీ చేశారు.గురువారం ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా కానుకలను పంపిణీ చేశారు.మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో 3,600 మంది ముస్లిం మహిళలకు చీర,బియ్యం,నెయ్యి,పాలు,జీడిపప్పు, కిస్మిస్,చక్కెర,కర్జుర అందజేశారు.అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…ప్రతి ఏటా రంజాన్ మాసంలో ముస్లీం పేద కుటుంబాలకు రంజాన్ కానుకను ఇస్తున్నట్లు చెప్పారు.కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పడేండ్లు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.అనంతరం డిసిసి అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ…కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో రంజాన్ కి తోఫాలు,బతుకమ్మ కి చీరలు,క్రిస్మస్ కి చీరల పంపిణీ కార్యక్రమం మతాలకు అతీతంగా దేశంలోనే గర్వించదగ్గ కార్యక్రమమని ఆధగత ఎన్నికల్లో ప్రతి ఆడబిడ్డని తన ఇంటి ఆడబిడ్డలా భావిస్తూ కుల,మత బేధాలు లేకుండా అందరికి అన్నలాగా తోడుంటమని,ప్రతి పండుగకి మొదటి కానుక నా ఇంటి నుండి వస్తుందని ఎన్నికల్లో మాట ఇచ్చింది మొదలు ఓడిపోయినా కానీ కలత చెందక అందరిని సమానంగా చూస్తున్న మనసున్న మహారాజు మన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని కొనియాడారు.ఇప్పటికైనా ప్రజలు అలోచించి ప్రజా సేవకి అర్హులైన ప్రేమ్ సాగర్ రావు ని వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించగలరని అన్నారు.దేశం లోనే ఎవరు చేయని కార్యక్రమం మన రాష్ట్రంలో మన మంచిర్యాల నియోజకవర్గం లో ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన జరగడం గర్వించదగిన విషయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,పీసీసీ సభ్యుడు కొండా చంద్రశేఖర్,మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు మజీద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత,బిసి సెల్ జిల్లా చైర్మన్ వడ్డే రాజమౌళి,కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking