ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. 33 జిల్లాలలో కనీవినీ ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు జిల్లా పాలనాధికారి స్టడీ మెటీరియల్ గురువారం అందించారు.
ఏప్రిల్ 10వ తేదీన ఎంసెట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్మల్ లోని సోఫీనగర్ లో గల నిర్మల్ అర్బన్ కే జీ బీ వి లో ప్రారంభించడం జరిగిందని,ఎంపీసీ, బైపిసి నుండి దాదాపు 109 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులు ఈ శిక్షణను తీసుకోవడం జరుగుచున్న సందర్బంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హైదరాబాదు వంటి జంట నగరాలకు వెళ్లి ఇట్టి శిక్షణా కార్యక్రమం తీసుకోవడము,ఆర్థిక భారంతో కూడుకున్నందున
ఉచిత భోజన వసతితో పాటు, విషయనిపుణులచే శిక్షణ ఇప్పించడం, శిక్షణా పొందుతున్న విధ్యార్థినులకు ఉపయుక్తంగా ఉండేలా రూపొందించిన స్టడీ మెటీరియల్ ను జిల్లా విద్యాశాఖాధీకారి డా. ఏ. రవీందర్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ,తాను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యారో,ఆ వివరాలను,తన స్వయం అనుభవాలను,ప్రిపేర్ అయ్యే విధానాలు వివరించారు.
విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా,ప్రశాంతంగా, ఏకాగ్రతతో ప్రతిరోజు కనీసము 16 గంటల పాటు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలని సూచించారు.
ప్రతి రోజు చదివిన అంశాలపై పరీక్ష ద్వారా మదింపు చేసుకోవాలని,అలాగే వారాంతపు పరీక్షలు కూడా రాయాలని తెలియజేశారు.నెల రోజులపాటు ఇలా కష్టపడితేనే విజయం వరిస్తుందని,కష్టపడిన వారే విజేతలు అవుతారని అన్నారు. విద్యార్థినులు చదువుతున్న విషయాలలో వచ్చిన సమస్యలు, సందేహాలను ఎప్పటికప్పుడు విషయ నిపుణులతో చర్చించి, నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కే జీ బీ వి ల సమన్వయకర్త శ్రీదేవి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్,ప్రత్యేక అధికారులు లత,సుజాత, తదితరులు పాల్గొన్నారు.