ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు హైటెక్ సిటీ లో రోడ్లు బురదనీటితో నిండిపోవడంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గురువారం వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ… కొన్నేళ్ళుగా రోడ్లు గుంతలమయమైనా మరమ్మతు చేపట్టకపో వడంతో చిన్నపాటి వర్షానికే నీరు గుంతల్లో నిలిచి బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.