ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ప్రాంతంలోని గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ప్రహరీ గోడ గురువారం కూలిపోయింది.వసతి గృహం ప్రహరీ గోడను అనుకుని ఉన్నటువంటి మున్సిపల్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్ లోని ఓ పెద్ద వృక్షం వర్షానికి ఒక్కసారిగా కూలిపోవడంతో దాని వేర్లు వసతి గృహం గోడల వరకు వ్యాప్తి చెంది ఉండటంతో అదే విధంగా నిర్మాణ పనులు జరుగుతుండటం కూడా కారణమై ఉండవచ్చని జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా,వసతి గృహం ప్రహరీ గోడ కూలిన సంఘటనపై జిల్లా దళిత అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి ఆదేశాలతో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ వసతి గృహాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా త్వరలోనే ప్రహరీ గోడ నిర్మాణానికి తగిన చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు.కాగా,ఈ ప్రమాదం లో విద్యార్థులకు ఎటువంటి నష్టం జరుగలేదు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ డబ్ల్యూ ఓ వెంట వసతి గృహ సంక్షేమాధికారి తిరుమల, సిబ్బంది వున్నారు.