అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ
జిల్లా ఎస్.పి.
డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
27.09.2024:
కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడుకలను ఈ రోజు జిల్లా నూతన పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. కొండ లక్ష్మణ్ బాపూజీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…. అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు, దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచిన, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేసినారని అన్నారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించిన వారిలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ .ఎస్.మహేందర్ , సాయుధధల డిఎస్పీ .రంగనాయక్ , ఎస్.బి.సి.ఐ..సందీప్ రెడ్డి , ఆర్.ఐ .శైలేందర్ , ఎఆర్ ఎస్.ఐలు శభవానీ కుమార్ , మహిపాల్ గారితో పాటు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.