– సాధ్యమైనంత త్వరలో నిర్వాసితులకు జీవనోపాధుల కల్పనను కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తాం.
– ఎస్సి,ఎస్టీ, బిసి,మైనారిటీ కార్పొరేషన్ ను టై అప్ చేసి అర్హులకు పథకాలు అందేలా చూస్తాం
– నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించాం.
– స్టూడెంట్స్ విద్యా సంవత్సరంకు డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ చేపడతాం.
– NGO ప్రతినిధుల సహకరంతో
స్కూల్ ల మ్యాపింగ్ చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తాం.
– అత్యంత పారదర్శకంగా తరలింపు, పునరావాస ప్రక్రియ పూర్తి చేస్తాం
– మూసి సుందరీకరణకు NGO లు తమవంతు తోడ్పాటును అందించాలి
*మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పై
పై NGO లతో నిర్వహించిన సమావేశంలో
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్*
ప్రజాబలం తెలుగు దినపత్రిక బ్యూరో ఛీఫ్: మాసబ్ ట్యాంక్ 27, సెప్టెంబర్ 2024:
మూసీ ప్రక్షాళనలో నిర్వాసితులయ్యే కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించడంతో సహా అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ స్పష్టం చేశారు.
శుక్రవారం మాసబ్ ట్యాంక్ లోని NIUM కాన్ఫరెన్స్ హాల్ నందు మూసి పౌర సంస్థల ( NGO) ప్రతినిధుల తో మూసి సుందరీకరణ, అభివృద్ధి, నిర్వాసితులకు పునరావాసం మొదలైన అంశాల పై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మూసి ప్రక్షాళన కు సంబంధించి NGO ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ మాట్లాడుతూ…
హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే మూసీ రివర్‌ను పునరుద్ధరించాల్సిందేనని అన్నారు. లేకపోతే ప్రమాదం పొంచి వుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు.
మేధా పాట్కర్ తో సహా అనేకమంది సామాజిక కార్యకర్తలు సేవ్ మూసి పేరుతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి NGO ప్రతినిధులకు గుర్తుచేశారు.
లండన్ థెమ్స్, సౌత్ కొరియా లోని సియోల్ నదుల్లా మూసీ నది రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మూసి ప్రక్షాళన కార్యక్రమం
ఏకపక్షంగా కాకుండా శంకరన్ స్ఫూర్తితో NGO లను, నిర్వాసిత కుటుంబాలతో చర్చించి వారి తరలింపు, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
జీవనోపాధుల కల్పన పై ప్రత్యేక దృష్టి
ప్రతి నిర్వాసిత కుటుంబం జీవనోపాధులపై సర్వే చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి జీవనోపాధులు కల్పించేందుకు సాధ్యమైనంత త్వరలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు.
సెర్ఫ్ మేనేజర్ దివ్య,
Ghmc కమిషనర్ అమ్ర పాలి, cdma డైరెక్టర్ గౌతమ్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పూజారి గౌతమి సభ్యులుగా కమిటీ మహిళా శక్తి పేరుతో
మెప్మా సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. మహిళా శక్తి పేరుతో ఉపాధి , శిక్షణ కార్యక్రమాలను చేపడుతుందన్నారు .
ఇష్టమైన వృత్తిని చేపట్టేందుకు సహకారం అందిస్తామని ముఖ్య కార్యదర్శి తెలిపారు.
నిర్వాసిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు
ఇప్పటికే మూసి నిర్వాసిత కుటుంబాలకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
పట్టా ఉంటే చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తాం
త్వరలోనే బఫర్ జోన్ లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ అంతా ఆయా ప్రాంతాలకు చెందిన కలెక్టర్, డిప్యూటి కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లు సహాయంతో చేపడతానని ముఖ్య కార్యదర్శి తెలిపారు.
బఫర్ జోన్ లో పట్టాలు ఉన్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పునరావాసం కల్పించి, పరిహారం అందజేయనున్నట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు. అలాగే చట్ట ప్రకారం రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేసాకే నిర్మాణాలను తొలగిస్తామని చెప్పారు.
ఇప్పటికే రివర్‌బెడ్‌లో నిర్మాణాల సర్వే, మార్కింగ్ ప్రక్రియ చేపట్టామని తెలిపారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామన్నారు.
రివర్ బెడ్ లో కూడా కొందరికి పట్టాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారు తమ పట్టాలను సంబంధిత జిల్లా కలెక్టర్ ఇవ్వాలన్నారు. పరిశీలించి అర్హులైతే పరిహారం అందజేస్తామని చెప్పారు.
విద్యా సంవత్సరంకు డిస్టర్బ్ కాకుండా చూస్తాం
నిర్వాసిత కుటుంబాలలో విద్యార్థులు ఉంటే వారి విద్యా సంవత్సరంకు డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ చేపడతామన్నారు. ఈ అంశం పై
NGO ప్రతినిధులతో కూడిన కమిటీ తో సర్వే చేపించి … వారి నివేదిక ఆధారంగా
డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో దగ్గరలో ఉన్న స్కూల్ లలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారిని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాల్లో కూడా చేర్పిస్తామనీ చెప్పారు.
మూసి పునరావాస ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఉన్నతాధికారుల తో హై లెవెల్ కమిటీ నీ ఏర్పాటు చేస్తామని ముఖ్య కార్యదర్శి తెలిపారు.
NGO ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలి
మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి , సుందరీకరణ కు NGO లు తమవంతు సహకారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కోరారు. హైదరాబాద్ భవిష్యత్తును ఆకాంక్షించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న ఈ ప్రాజెక్టు అమలుకు నిర్వాసిత కుటుంబాలు సహకారం అందించేలా, ప్రభుత్వంతో కలిసి నడిచేలా క్షేత్ర స్థాయికి వెళ్లి వారిని చైతన్యం చేయాలని కోరారు.
సమావేశంలో ప్రజావాణి నోడల్ అధికారి దివ్య, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్,
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ ఎండి పూజారి గౌతమి, అధికారులు, NGO ప్రతినిధులు ప్రొఫెసర్ హర గోపాల్, వి సంధ్య, లిస్సి జోసెఫ్, టి శ్రీహర్ష, మహమ్మద్ అహ్మద్, సమీరా బేగం, సయ్యద్ బిలాల్, అంజం యాస్మిన్, ఫరియా బేగం, సారా సుల్తానా తదితరులు పాల్గొన్నారు .