మిద్దెల జితేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించి సత్కరించిన కృష్ణారెడ్డి.

 

తూప్రాన్, ఫిబ్రవరి, 20 ప్రజాబలం ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ జన్మదిన
వేడుకలు గురువారం హైదారాబాద్ లోని గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు.
జితేందర్ జన్మదిన వేడుకలకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భారీగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ జన్మదిన సంబరాల్లో తూప్రాన్ మండలం
గుండ్రెడ్డిపల్లి కి చెందిన గజ్వేల్ నియోజవర్గం సేవాదళ్ అధ్యక్షులు తాడూరి కిష్టారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తేవడానికి విశేష కృషి చేశారని ఆయన సేవలు కొనియాడారు. ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో కలకాలం జీవించి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. జితేందర్ తన జన్మదిన సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యంగా మెదక్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గం ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు తాడూరి కిష్టారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి సేవలు అభినందనీయమని కొనియాడారు. సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ కృష్ణారెడ్డి ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలతో మమేకమై వారికి సేవలు అందిస్తూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. త్వరలో కృష్ణారెడ్డి సేవలు గుర్తించి పార్టీలో మంచి గుర్తింపు హోదా, పదవి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking