కేటీఆర్‌, హరీష్‌ రావు వారి పద్దతి మార్చుకోవాలి.

మల్లు రవి ప్రభుత్వ అధికార ప్రతినిధి
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..
కేసీఆర్‌ కాలి గోటికి కూడా రేవంత్‌ రెడ్డి సరిపొడు అంటూ కేటీఆర్‌ మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట…
ప్రజలు తీర్పు ఇస్తే ప్రజాస్వామ్య బద్దంగా రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో విప్లవాత్మక పాలన చేస్తున్నారు.
ప్రజా రంజకంగా, ప్రజా పాలన చేస్తూ ప్రజల మనసులలో స్తానం సంపాదించారు.
ప్రజాభిమానంతో సీఎం గా పని చేస్తున్న ముఖ్యమంత్రి పట్ల కేటీఆర్‌ ఇలా అనుచితంగా మాట్లాడ్డం ప్రజలను అవమానించడమే అవుతుంది.
ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తిరగబడుతారు.
హరీష్‌ రావు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారిని హుందాతనం లేదని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట..
ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రజా పాలన చేస్తూ హుందాగా వ్యవహరిస్తున్న రేవంత్‌ రెడ్డి ని ఇలా అనడం పద్దతి కాదు..

Leave A Reply

Your email address will not be published.

Breaking