రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 ఆగస్టు 2024
ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలుచేయడంలో విఫలమైన తెలంగాణ ముఖ్య మంత్రేమో రుణమాఫీ పూర్తయిందని చెప్తుంటే, ఇతర మంత్రులేమో మనిషికో మాట చెబుతూ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేవెళ్లలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని రుణమాఫీ చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అని మొదలు పెట్టీ రైతు రుణమాఫీకి 49 వేల కోట్లు అవసరం అని బ్యాంక్ అధికారులు తెలుపగా అంతేనా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు పంచోచ్చని అని తెలిపిన ముఖ్య మంత్రి, అన్ని దేవుళ్ళ మీద ఒట్టులు పెట్టుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొంది, మంత్రి మండలిలో దాన్ని కాస్తా 31 వేల కోట్లుగా కుదిస్తు, బడ్జెట్లో 26 వేల కోట్లుగా తెలిపడమైనదని, వాస్తవానికి 17,900 కోట్లు బ్యాంక్ ఖాతాలలో వేసినమ్ అని చెప్పగా, 7,500 కోట్లు మాత్రం బ్యాంక్ ఖాతాలలో వేసినమని కాంగ్రెస్ మంత్రి బట్టివిక్రమార్కా చెబుతున్నారని తలా తొక పొంతన లేని మాటలతో ప్రభుత్వం సాగిస్తున్నారని, రంగారెడ్డి జిల్లాకు ఫార్మా, మెట్రో లేదనీ, రైతు బంధు తది తర ప్రజా రంజక సంక్షేమ పథకాలన్నీ అటకెక్కినవని, అన్ని సమయానికి సమకూర్చమని మీరు గెలిపించితే పార్టీ మారిన శాసన సభ్యులని నిలదీయండని లేనిచో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా లాగుల తోన్డలు వేస్తామని, చేవెళ్ల చెల్లమ్మ సబితమ్మ ముఖ్యమంత్రి నీకు పాలన చేతకాక ఇంట్లో దోమలు, బయట కుక్కల చందంగా సాగిస్తున్నావని అన్నందున అక్కసుతో అక్కలని నమ్ముకుంటే కే.టీ.ఆర్ నీ బ్రతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవ్తవని పిచ్చి కూతలు కుయడం జరిగినదని బదులుగా చేవెళ్ల ప్రజానీకం జవాబు చెప్పాలని, రైతంగానికి రుణమాఫీ చేసే వరకు వదిలేది లేదనీ కే టీ ఆర్ చెప్పడం జరిగినది, ఇట్టి కార్య క్రమంలో పూర్వ మంత్రిణి సబితా ఇంద్రా రెడ్డి, యువ నాయకుడు కార్తీక్ రెడ్డితో పాటు సీతారాం ధూళిపాళ, మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగల్ల ధనరాజ్, కౌన్సిలర్ నవీన్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బబ్లూ, యాలల కిరణ్, శ్రీధర్ గుప్తా, దిలీప్, శివ ముదిరాజు, ప్రవీణ్, భాను, ఎర్రోళ్ల రమేష్, షేక్ ఆశూక్ అలి, నవీన్ గురుకుల, ప్రవీణ్ కుమార్, ఏరోళ్ల భిక్షపతి, కృపాకర్, మొనేశ్, జైరామ్, భిక్షపతి, ఎల్లస్వామి, శ్రీనివాస్, తిమోతి, శివరాజ్, విష్ణు, సాయి, జయరాం, విజయ్, మహిళా నాయకురాల్లు రేఖా, మంజు, సుమ, సింధు తది తరులు పాల్గొన్నారు.
