హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ లో నిన్న కురిసిన భారీ వర్షానికి రేకుల షెడ్డు కూలిన ఘటనలో సమద్ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందగా, ఈరోజు మాజీ మంత్రివర్యులు, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్లు శ్రీ రాగం నాగేందర్ యాదవ్ , శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి, లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.
మరియు రషీద్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ గారు ,ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం అని, బాలుడి మృతి మమ్మల్ని ఎంతగానో కలిచివేసింది. బాలుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, ఎమ్మెల్యే శ్రీ ఆరెకపూడి గాంధీ గా తెలియచేసారు.