పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అధికారి భవేశ్‌ మిశ్రా

జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్‌ మిశ్రా సోమవారం భూపాలపల్లి, ఘన్పూర్‌, చిట్యాల జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ పాఠశాలలో జరుగుతున్న ఖమ్మం నల్గొండ వరంగల్‌ పట్టబద్రుల శాసనమండలి ఉపఎన్నిక పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఖమ్మం, నల్గొం, డ వరంగల్‌ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 16 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని 12535 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఆయన తెలిపారు. 52 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో నంబర్లు వేయాల్సి ఉన్నదని అన్నారు. ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించు కుంటున్నారని తెలిపారు.
పోలింగ్‌ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగానికి పట్టభద్రుల ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరం పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్‌ కాస్టింగ్‌ చేయడం జరుగుతుందని, కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము నుండి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్ల రద్దీ దృష్ట్యా ఉన్నదని, సత్వరం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని పిఓ లను ఆదేశించారు.
ఓటు హక్కు కలిగిన పట్టభద్రులు
ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుమని
అంతటి ప్రాధాన్యత కలిగిన ఓటును తప్పని సరిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మంగీలాల్‌, తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking