సంగారెడ్డి మార్చి:23 ప్రజ బలం ప్రతినిధి: *1920-21లో సహాయనిరా కరణోద్యమానికి గాంధీజీ పిలుపు నిచ్చారు. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్న కాలంలోనే ‘చౌరీ చౌరా’ ఘటనలో ప్రజలు తెగించి తిరగబడ్డారు, బ్రిటీష్ ప్రభుత్వ లాఠీఛార్జితో లాలా లజ పతిరాయ్ ప్రాణాలను బలితీసు కున్నారు. నిరసనగా భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులు,మహా నాయకుని చావుకు కారణమైన శాండర్స్‌ను కాల్చి చంపడం, ఢిల్లీ పార్లమెంటులో పోగబాంబులు వేయడంవంటి చర్యలవెనుక వారి ఆలోచనల్లో వ్యక్తమైన స్పష్టత, వారి భావజాలాన్ని ప్రతిబింబిస్తాయి. భారతదేశ విముక్తి ప్రతిఘటన ద్వారా మాత్రమే సాధ్యపడు తుందన్న లక్ష్యం కనపడుతుంది
*హిందూస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ’ పేరును ‘హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ’గా మార్చి మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్య క్రమాలను, సంబంధిత క్రతువు లను నిషేధించాలన్నారు. భారత సమాజంలోసమూలమైనమార్పు కోసం 92 సంవత్సరాల క్రితం, మార్చి 23 న(23 సం:) భగత్‌సింగ్, సుఖ దేవ్,రాజ్‌గురు లు అమరులైనారు. మన వీరుల బలిదానంనేటికీ స్ఫూర్తిదాయకం మతోన్మాదంపై, మరియు ప్రజల హక్కులు- సౌకర్యా ల కొరకై, పోరాటాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే నిజమైననివాళి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ ఫోరం (TSF) రాష్ట్ర కార్యదర్శి ఎల్.వేణుగోపాల్ , యం.శివ శేకర్, రాజు, వెంకట్, సురి, తదితరులు పాల్గొన్నారు.