ఈనెల 31 లోగా రుణ లక్ష్యాలను సాధించాలి…. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

 

సంగారెడ్డి మార్చి:23 ప్రజ బలం ప్రతినిధి: బ్యాంకర్లు ఈనెల 31 లోగా రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని, వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో చొరవ చూపాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ(స్పెషల్ డి సి సి) సమావేశం జరిగింది. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలలో శాఖల వారీగా లక్ష్యాల పురోగతి, పెండింగ్,
యూనిట్ల గ్రౌండింగ్ తదితరాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ల ద్వారా వివిధ పథకాలలో అందిస్తున్న యూనిట్లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని, మార్చి 31 లోగా రుణ లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పిఎంఈజీపి, పిఎంఎఫ్ ఎంఈ ఈ నెలాఖరులోపు వంద శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలని సంబంధిత అధికారులు, బ్యాంకర్లకు ఆదేశించారు.
అధికారులు బ్యాంకర్లు సమన్వయ సహకారాలతో జిల్లా రుణ లక్ష్యాలు సాధించాలని కోరారు.
ఈ ఆర్థిక సంవత్సరం పంట రుణాల లక్ష్యం రూ.2450 కోట్లు కాగా మార్చి,20 నాటికి రూ.2482.75 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. ఖరీఫ్ లక్ష్యము రూ. 1473 కోట్లు కాగా రూ.1392.76కోట్లు రుణాలు ఇచ్చామని,రబీ రుణ లక్ష్యం.రూ. 976.99 కోట్లు కాగా రూ.1089.99 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు.
డీఆర్డిఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.840 కోట్ల రుణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ. 857 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు.
లక్ష్యాన్ని మించి పంట రుణాలు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రుణాలు అందించినందుకు బ్యాంకర్లను, సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి ,లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ,వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking