బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా కురుగుంట మనోహర్,

 

పదవి బాధ్యతలు ఇచ్చినందుకు బీజేవైఎం, బిజెపి రాష్ట్ర జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు,

తేదీ:- 23-08-2024 శుక్రవారం ప్రజాబలం న్యూస్:-
(అనంతపురం జిల్లా)

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా కురుగుంట మనోహర్ ను నియమిస్తున్నట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మంజుల వెంకటేష్ గారు నియామక పత్రాన్ని ఆదివారం నాడు అందజేశారు,ఈ సందర్భంగా కురుగుంట మనోహర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి బిజెపి ప్రభుత్వాన్ని బలపరచడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు,విద్యార్థి యువజన ప్రజా సమస్యలు ఏవి మా దృష్టికి వచ్చిన వాటి పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు,భవిష్యత్తు కాలంలో జిల్లాలో పార్టీ బలోపితానికి కృషి చేస్తానని పేర్కొన్నారు,నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతకు సహకరించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి గారికి,బిజెపి జిల్లా అధ్యక్షులు సంధి రెడ్డి శ్రీనివాసులు గారికి, బీజేవైఎం రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్ గారికి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మంజుల వెంకటేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking