ఖమ్మం ప్రతినిధి మే01(ప్రజాబలం) ఖమ్మం జిల్లా కురుమ, యాదవుల సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్, సింగరేణి పి ఎస్ ఎస్ డైరెక్టర్ డేగల ఉపేందర్, సంత చైర్మన్ అడ్డగోడ ఐలయ్య యాదవ్ తెలిపారు సింగరేణి మండల కేంద్రంలో యాదవ ప్రముఖుల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ కురుమ యాదవులకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయకపోగా కల్లబొల్లి మాటలతో, గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో మాయమాటలతో మోసం చేసి ఓట్లు వేయించుకోవడం జరిగిందని , దాదాపు 50 లక్షల జనాభా ఉన్న కురుమ యాదవులకు కేవలం 3 లక్షల మందికి కంటి తుడుపుగా గొర్రెలు ఇప్పించి, అది కూడా దళారీలు, అధికార పార్టీ నాయకులు, అధికారులు కలిసి గొర్రెలు ఇప్పించడంలో మోసం చేయడం జరిగిందని విమర్శించారు. కురుమ యాదవులకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేసిందని, గొర్రెలకు భీమా చేయించింది, గొర్రెల సంఘాలు ఏర్పాటు చేసింది, ఎన్సీడీసీ స్కీముని ఏర్పాటు చేసింది, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరి కి ఒక లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, బి ఆర్ఎస్ ప్రభుత్వంలో గత పథకాలు నెర వేర్చకపోగా వాటిని రద్దు చేసిందని మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే కురుమ యాదవులకు అభివృద్ధి జరుగుతుందని బి ఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోయినట్లేనని మల్లి బాబు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గడ్డం వెంకటేశ్వర్లు, కిసాన్ సెల్ నాయకులు దాసరి ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన అధ్యక్షులు ఆవుల వెంకటేశ్వర్లు, బండారు మోహన్ రావు, పచ్చిపాల వెంకట్ యాదవ్, మద్దె బోయిన మల్లేష్ , పచ్చిపాల యుగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు