* లేబర్ వేజ్ రేట్ 200/- కన్నా తక్కువ ఉండరాదు
* హరితహారం జిల్లా లక్ష్యం 50 లక్షలు
* మొక్కలు నాటడానికి స్థలాలు గుర్తించాలి
* ధాన్యం కొనుగోళ్ళు వేగవంతంగా పూర్తి చేయాలి
* అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలి
* ఓకే ఇంటి నంబర్ తో 6 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను భౌతికంగా పరిశీలించాలి
* జిల్లాస్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం చేయాలి
* స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం సజావుగా జరగాలి
….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి, మే 19 ప్రజ బలం ప్రతినిది:
జిల్లాలోని అన్ని మండలాల్లో ఆక్టివ్ లేబర్లో 80 శాతం లేబర్ మొబిలైజేషన్ జరగాలని, లేబర్ వేజ్ రేట్ 200 కన్నా తక్కువ ఉండరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
శుక్రవారం వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
లేబర్ మొబిలైజేషన్ 80 శాతం కన్నా తక్కువ ఉన్నట్లైతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కూలీ 200 రూపాయల కన్నా తక్కువ ఉండరాదన్నారు. లేబర్ ఎక్కువ పని గంటలు చేసేలా చూడాలన్నారు.
ఎండ తీవ్రత ఉన్నందున ఉపాధి కూలీలు పనిచేసే చోట తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ సంవత్సరం హరితహారం లో జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యమని, ఆ మేరకు స్థలాలను గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ , ఇన్స్టిట్యూషన్స్ , వైకుంఠధామాలు ,డంపు యార్డులలో, రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కల గ్యాప్స్ గుర్తించి,కొత్త మొక్కలు పెట్టాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలని,జిల్లాలో ధాన్యం రవాణాకు లారీల కొరత రాకూడదని తెలిపారు. లారీల మొబిలైజేషన్లో రెవిన్యూ, ట్రాన్స్పోర్ట్ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి సమస్య లేకుండా చూడాలన్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు బాగా జరుగుతున్నాయని, కొన్నిచోట్ల నిర్లక్ష్యం కనిపిస్తుందని, ఆయా సెంటర్ల సూపర్వైజరీ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీవో 59 లో చెల్లించాల్సిన మొత్తం ఐదు లక్షల లోపు ఉన్న లబ్ధిదారులు వెంటనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దారులకు సూచించారు.
అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను గ్రామం వారీగా ఈనెల 26 లోగా అందించాలని తహసిల్దార్లకు ఆదేశించారు.
ఓటర్ జాబితా రిలేటెడ్ పనులు బాగా చేశారని తహసిల్దారులను అభినందించారు. ఫోటో సిమిలర్ ఎంట్రీ, డెలిశన్స్ తదితరాలకు సరి అయిన చర్యలు తీసుకోవాలని, ఒకటికి రెండుసార్లు పరిశీలించి ప్రాపర్ గా చేయాలని సూచించారు. అదేవిధంగా ఒకే ఇంటి నంబర్తో 6 మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న గృహాలను విధిగా పరిశీలించాలని తెలిపారు. బి ఎల్ ఓ ల వివరాల జాబితాను పొలిటికల్ పార్టీల ప్రతినిధులకు ఇవ్వాలన్నారు.
ఈనెల 17 నుండి 23 వరకు కొనసాగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో ఆయా నిర్దేశిత పనులను సజావుగా చేయాలని ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీలకు సూచించారు.
ఈనెల 22 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం చేయాలని,అందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్రీడా పోటీలు ఉదయం సాయంత్రం వేళలో నిర్వహించాలని, క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మండల స్థాయి క్రీడలను విజయవంతం చేసిన అధికారుల లందరిని కలెక్టర్ అభినందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, సివిల్ సప్లై స్ డి ఎం సుగుణ బాయ్, మెప్మా పీడీ గీత, డీఎస్ఓ వనజాత, ఆర్టిఓ శివలింగయ్య, డిఆర్డిఏ అదనపు పీడీలు, మండల ప్రత్యేక అధికారులు, ఆయా అధికారులు, ప్యాక్స్ సీఈఓ లు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు.