33వ రోజుకు చేరిన వీఓఏ ల నిరవధిక సమ్మె
ప్రజా బలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో వీఓఏ లు చేస్తున్న నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా వీఓఏ ల రాష్ట్ర కార్యదర్శి దుర్గం రాములు మాట్లాడుతూ… ప్రభుత్వం ఐకేపి వీఓఏ ల పట్ల పక్ష పాతం చూపుతుందని, మాయమాటలతో మా కడుపు కొడుతున్నారని నేటికీ 33వ రోజును పురస్కరించుకొని స్థానిక గాంధీ చౌక్ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం చాలా బాధాకరం అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు లింగంపెల్లి వెంకటేష్ మాట్లాడుతూ…మునుగోడు ఎన్నికల్లో మంత్రులు ఇచ్చిన ఏమయ్యాయని ప్రశ్నించారు.గాలి మాటలు గాలికే అనట్టుగా విధులు బహిష్కరించి 33రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం వీఓఏ లను అవమానించినట్టే అన్నారు.ఇకనైనా ప్రభుత్వం మేలుకొని తమ న్యాయపరమైన డిమాండ్ లను నెరవేర్చాలని లేనియెడల రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు ఇంకా ఉదృక్తం చేస్తామన్నారు.ఈ నిరసన సమ్మెలో నియోజకవర్గం అధ్యక్షురాలు అనిత,మండల అధ్యక్షురాలు కళావతి,కోశాధికారి లావణ్య మండల వీఓఏ లు తదితరులు పాల్గొన్నారు.