ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 19 : ఎన్ హెచ్- 63 రోడ్డు విస్తరణకు జరుగుతున్న సర్వే పనులను లక్షెట్టిపేట పురపాలిక లోని ఇటిక్యాల వద్ద శుక్రవారం బాధితులు అడ్డుకున్నారు.గత మూడు రోజులుగా హాజీపూర్ మండలం ముల్కల వద్ద నుంచి విస్తరణ సర్వే నడుస్తోంది. అందులో భాగంగా సర్వేయర్లు ఇటిక్యాల వద్దకు చేరుకోగా తెలుసుకున్న లక్షెట్టిపేట పురపాలిక,దండేపల్లి మండలం పరిధిలోని బాధితులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు.ఇక్కడ సర్వేకు ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఎన్ హెచ్ – 63 మంచిర్యాల పీడితో ఫోన్లో మాట్లాడారు. దీనికి స్పందించిన ఆయన ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు లక్షెట్టిపేట పురపాలక పరిధిలో సర్వే చేయవద్దని సర్వేయర్లను ఆదేశించారు.దీంతో ఆ సర్వేయర్లు తమ సర్వేను నిలిపివేశారు.