లక్షెట్టిపేట మున్సిపాలిటీలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 19 : రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాల మేరకు తేదీ 2023-05-19 నుండి 2023-05-27 వరకుపట్టణంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఆదేశాలు జారీచేయడం జరిగినది.ఇట్టి ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు పాలనాదికారి మంచిర్యాల లక్షెట్టిపేట పట్టణంలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ఆదేశించారు.ఇందులో భాగంగా శుక్రవారం వార్డ్ నెంబర్ 5,11 నందు ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.ఈ ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాన్ని చైర్మన్ నల్మాస్ కాంతయ్య,మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్,వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మేనేజర్లు శ్రీహరి,రాజశేకర్ పర్యటించి ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అజీం,దినేష్,కమల్,కార్యాలయ సిబ్బంది,కార్యాలయం పర్యవేక్షించారు ఇట్టి ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ట్రాక్టర్లు,జెసిబి,డోజర్ అదనపు పారిశుధ్య కార్మికులను వినియోగించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking