భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలి: కమిషనర్‌ ఇలంబర్తి

అంబర్‌ పేట్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌, ఫిబ్రవరి 18: జాతీయ రహదారులు రోడ్డు భావనాల శాఖ ఆధ్వర్యంలో గోల్నాక నుండి అంబర్‌ పేట్‌ వరకు సుమారు రూ. 335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్‌ కు అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్‌ ఆర్‌ అండ్‌ బి జాతీయ రహదారి శాఖ యస్‌ఈ, జిహెచ్‌ఎంసి అడిషనల్‌ జోనల్‌, ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌ కు సంబంధించి అసంపూర్తి గా ఉన్న భూసేకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

 


ఈ సందర్భంగా యస్‌.ఈ ధర్మారెడ్డి మాట్లాడుతూ… ఫ్లైఓవర్‌ కు సంబంధించిన సివిల్‌ పనులు పూర్తయ్యాయని సర్వీస్‌ రోడ్డు వేసేందుకు వివిధ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పనులను కొనసాగించడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్‌ కు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్‌ గోల్నాక నుండి అంబర్‌ పేట్‌ వరకు అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముస్లిం కమ్యూనిటీ పెద్దలు ఈ ప్రాంతంలో అభివృద్ధికి జరిగేందుకు సహకరించడం జరుగుతుందని అధికారులకు పూర్తి సహకారం అందిస్తానని కమిషనర్‌ కు వివరించారు. కొన్ని స్ట్రెచెస్‌ ల నిర్మాణానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అట్టి పనులను కొనసాగించాలని కమిషనర్‌ ఆర్‌ అండ్‌ బి అధికారులను ఆదేశించారు.
వివిధ స్ట్రెచ్చేస్‌ లలో అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కమిషనర్‌ వెంట జాతీయ రహదారులు ఆర్‌ అండ్‌ బి యస్‌.ఈ ధర్మారెడ్డి, అడిషనల్‌ కమిషనర్లు శివకుమార్‌ నాయుడు, రఘుప్రసాద్‌, జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, డిసి దివాకర్‌, జోనల్‌ ఎస్‌ ఈ రత్నాకర్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసిపి దివాకర్‌, ఈ ఈ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking