దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేయాలి
అధికారులను ఆదేశించినా
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి
13.09.2024:
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై సంబంధిత ఇరిగేషన్ ఏఈలు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్స్ తో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను సమర్ధవంతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని,. ఎల్‌ఆర్‌ఎస్ కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల వారీగా దరఖాస్తుల వర్గీకరణపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ పంచాయతీరాజ్ ఇరిగేషన్ సంబంధిత శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండో విడత ప్రజా పాలన ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియ కొనసాగించడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పారు.
ఈనెల 17వ తారీఖున ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని. అన్ని పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయపతాక ఆవిష్కరణ నిర్వహించాలని
అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్చార్జ్ అధికారి
కరుణాకర్, ఎంపీడీవోలు, ఎం పి ఓ లు, ఇరిగేషన్ ఏఈలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్
సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
