మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ సెప్టెంబర్ 17:నాచారం లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,రాజీ రెడ్డి తోపాటు నల్ల రాధ కృష్ణ లు హాజరయ్యారు. నాచారం వైజయంతి, వి ఎస్ టి పార్క్ తోపాటు పలు ప్రాంతాలలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను సీఎం రేవంత్ రెడ్డి పిలుపుమేరకు ప్రజా పాలన దినోత్సవం గా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కిషోర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, గురు,క్రాంతి కిషోర్, విజయ్ కుమార్ సింగ్, శ్రీధర్, శ్రీకాంత్, లీలావతి,అశోక్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, నవీన్,ప్రభాకర్, సలీం, శ్రీను, జెస్సీ, సెబాస్టియన్, మహేందర్ రెడ్డి,మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు