జాతీయ జెండా ఆవిష్కరించిన మెదక్ ఆర్డీవో రమాదేవి

 

ప్రజా బలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం
17.09.2024:

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మెదక్ ఆర్డీవో రమాదేవి
స్థానిక మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆర్డీవో రమాదేవి జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగ ఫలితం వల్ల రాష్ట్రం సిద్ధించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విభిన్న మతాలు కులాలు కలిసి ఉంటాయన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు ,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking