ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్, మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఆర్ఐ దామోదర్, ఆర్ఎస్ఐ శ్రావణి, వెంకట్,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.