కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ ఆకస్మిక తనిఖీచేసిన కలెక్టర్

 

ఆరోగ్య కేంద్రాలు ఉత్తమ సేవలు అందించాలి

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజాబలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం- కౌడిపల్లి17.09.2024:

కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రోగులతో ఆరోగ్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
మందులు నిల్వ ఉంచే గదిని, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సదుపాయాలపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.
అందుకోసమే ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలన్నారు.
వారం రోజుల్లో ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు గుర్తించి, పరిష్కరిస్తామన్నారు.
ఇద్దరు సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking