నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 17 : వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని వివిధ వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయక నవరాత్రులు పూర్తి చేసుకుని ఘనంగా శోభ యాత్ర నిర్వహించి చేపట్టే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు.నిమజ్జనం కొరకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, క్రేన్లు అందుబాటులో ఉంచామని,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు.శోభయాత్ర కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ సామరస్యంతో నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking